Sitakka | రెండు పార్టీలు కలిసే ఉంటాయి..

Sitakka | రెండు పార్టీలు కలిసే ఉంటాయి..

  • మంత్రి సీతక్క

Sitakka | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : కాంగ్రెస్, సీపీఐ పార్టీలు రెండూ కలిసే ఉంటాయని తెలంగాణ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. హైదరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఈ రెండు పార్టీలు ఎప్పటికీ విడిపోవన్నారు. స్థానిక నాయకత్వంలో ఉన్న చిన్న గ్యాప్ అంతే కానీ.. కూటమిగా రెండు పార్టీలు కలిసే ఉంటాయన్నారు. ఇది జాతీయ స్థాయిలో ఉన్న పొత్తు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80శాతం గెలుచుకుందన్నారు. ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఇది గొప్ప విజయమన్నారు. ఎన్నికల్లో డబ్బుల సంస్కృతి బీఆర్ఎస్ దేనన్నారు. పార్టీలో కొంతమేర రెబల్స్ బెడద ఉందన్నారు.

Leave a Reply