Village | గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలి…

Village | గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలి…
Village | మునుగోడు, ఆంధ్రప్రభ : లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా, శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలని సర్పంచ్ అద్దంకి రామలింగయ్య ఆకాంక్షించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోరటికల్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈరోజు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
మాదిరెడ్డి అండాలమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ నేలపట్ల నరేష్, మండల అభివృద్ధి అధికారి గంగుల యుగంధర్ రెడ్డి, ఉపసర్పంచ్ మందుల అంజయ్య, సూపరింటెండెంట్ విజయభాస్కర్, ఆర్‌ఐ వంశీ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, జీపీఓ వెంకట్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామాభివృద్ధి పనుల్లో ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఐక్యతతో ముందుకు సాగితే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామరస్యానికి నాంది పలుకుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మహిళలు, యువత భక్తి భావంతో పాల్గొన్నారు.
