7వ వార్డులో గొల్ల వంశీయాదవ్ ఘన విజయం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌గా గొల్ల వంశీయాదవ్ గెలుపొందారు. శుక్రవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అనే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఓట్ల లెక్కింపులో గొల్ల వంశీయాదవ్దే పై చెయ్యిగా నిలిచింది. గతంలో రెండు పర్యయాలుగా పోటీ చేసి ఓడిపోయిన వంశీయాదవ్.. ఈ ఎన్నికల్లో మాత్రం చాలెంజ్‌గా తీసుకున్నారు. ప్రతి ఇంటింటికీ తిరిగి ఓటర్లను అభ్యర్థించి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఓటర్లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని వంశీ చెప్పారు. ఈ విజయం గర్హకారణంగా ఉందని, ఎంతో బాధ్యతను పెంచిందని తెలిపారు.
