కాంగ్రెస్ – బిఆర్ఎస్ హోరా హోరీ ..

కాంగ్రెస్ – బిఆర్ఎస్ హోరా హోరీ ..
- 10 వార్డుల్లో కాంగ్రెస్ 5, బీఆర్ ఎస్ 4, బీజేపీ 01
- మొదటి రౌండ్ లెక్కింపు పూర్తి
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ 30 వార్డులకు శుక్రవారం ఉదయం 8.30 గంటల నుండి లెక్కింపు ప్రారంభం కాగా ఓట్లను 10 టేబుల్స్ లో లెక్కించి అనంతరం అధికారులు ఫలితాలు వెల్లడించారు. కాంగ్రెస్ , బిఆర్ఎస్ మధ్య హోరా హోరీ పోటీ కొనసాగుతుంది.
మొదటి రౌండ్లో
ఓట్లతో 1వ వార్డు కౌన్సిలర్ గా బౌతు శోభా రాజేష్ ( కాంగ్రెస్ ) 389 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
4వ వార్డు కౌన్సిలర్ కన్నం యుగేందర్ (బిజెపి ) 101 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
7వ వార్డు కౌన్సిలర్ గా రత్నం సుమంజళి అనినాష్ 120 ఓట్ల మెజారిటీ , 10వ వార్డు కౌన్సిలర్ గా పుల్లూరి మంజుల మాధవ రావు (కాంగ్రెస్ )
130 ఓట్ల మెజారిటీ,
13వ వార్డు కౌన్సిలర్ గా బడితెల వెంకట స్వామి (కాంగ్రెస్ ) 54 ఓట్ల మెజారిటీ,
, 16వ వార్డు కౌన్సిలర్ గా జ్యోతుల మంజుల (బిఆర్ ఎస్) 110 ఓట్ల మెజారిటీ ,
19వ వార్డు కౌన్సిలర్ గా కురిమిల్ల శ్రీనివాస్ ( కాంగ్రెస్ ) 21 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 22వ వార్డు కౌన్సిలర్ గా బుర్ర రమాదేవి సదానందం గౌడ్ (బి ఎంఆర్ఎస్) 288 ఓట్ల మెజారిటీ, 25వ వార్డు కౌన్సిలర్ గా పొనకంటి మేఘన శ్రీనివాస్ (కాంగ్రెస్) 664 మెజారిటీతో, 28వ వార్డు కౌన్సిలర్ గా భోగం నరేందర్ (బిఆర్ఎస్) 130 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు.
