19th feb | ఆగిన పసిడి పరుగు

19th feb | ఆగిన పసిడి పరుగు

19th feb | పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం – జ్యువెలరీ షాపులకు జనాల దౌడు
ఆకాశాన్నంటిన బంగారం ధరలు – మధ్యతరగతి ఆందోళన
హైదరాబాద్‌లో నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు
కొనుగోలు దారులకు ఇది సువర్ణ అవకాశమా?
భవిష్యత్‌లో ధరలు ఎలా ఉండనున్నాయి? మార్కెట్ అంచనాలు

  • ఆగిన ప‌సిడి ప‌రుగు
  • నిల‌బ‌డిన వెండి
  • త‌గ్గిన గోల్డ్, సిల్వ‌ర్‌ ధ‌ర‌లు
  • ఫిబ్రవరి 19వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్
  • జ్యువెల‌రీల‌కు జ‌నం దౌడ్‌

19th feb | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఫిబ్రవరి నుంచి పెళ్లిళ్లు మళ్లీ మొదలయ్యాయి. ఈ నెలతో పాటు రాబోయే రెండు మూడు నెలల పాటు పెళ్లిళ్లు జోరుగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్నాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ఆభరణాలను కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపించడం అనేది సహజమే. సామాన్యుడి ఆశలకు, బంగారం ధరలు ఊపిరిపోస్తున్నాయా, లేక ఆశలపై నీళ్ళు చల్లుతున్నాయా, రాబోయే రోజుల్లో అసలు సామాన్యులు బంగారం కొనగలరా, బంగారం ధరల హెచ్చుతగ్గులపై ఆంధ్రప్రభ వెబ్ అందిస్తోన్న ప్రత్యేక కథనం..

అయితే గ‌త కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లు పైపైకి పోతుండ‌టంతో దానిని కొనేందుకు జ‌నం వెనుక‌డుగు వేస్తున్నారు. జ్యువెల‌రీ దుకాణం వైపు వెళ్లాలంటేనే హ‌డ‌లిపోతున్నారు.

19th feb
19th feb

బంగారం కొన‌డానికి మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి. వాటి ధ‌ర‌లు రోజురోజుకూ పెరుగుతుండ‌టంతో జంకుతున్నారు. బంగారం ధరలు ఈ మధ్య కాలంలో పెరిగినట్లుగా ఎప్పుడూ పెరగలేదు. ఆకాశమే హద్దుగా దీని రేటు నింగిని తాకింది. ఈ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. పెళ్లి అంటేనే బంగారంతో ముడి పడి ఉంటుంది. కచ్చితంగా గోల్డ్ కొనాల్సిందే.

దీంతో జ్యువెలరీ షాపులకు జ‌నం ప‌రుగులు తీస్తున్నారు. అక్క‌డ బంగారం ధ‌ర చెప్ప‌గానే క‌ళ్లు తేలేస్తున్నారు. ఇంత ధ‌ర‌నా అని నోరెళ్ల పెడుతున్నారు. ఈరోజు ధ‌ర‌లిలా.. హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1200 తగ్గి రూ.1,58,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,100 తగ్గి రూ.1,45,210 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,18,800 గా నమోదైంది.

click here to read more

Leave a Reply