YCP | భూ కేటాయింపులపై వ్యతిరేకత

YCP | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ శాసనమండలిలో కంపెనీలకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. వైసీపీ నేతలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. అనంతరం ప్రభుత్వ భూ కేటాయింపులపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, శాసనమండలి నుంచి వైసీపీకి చెందిన సభ్యులు వాకౌట్ చేశారు. ప్రభుత్వ భూ దోపిడీకి నిరసనగా తాము ఈ చర్య చేపట్టామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Leave a Reply