ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ – బంగ్లా జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు… 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.
ఈ క్రమంలో 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
9.5వ ఓవర్లో తస్కిన్ అహ్మద్ వేసిన బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఓపెనర్ గా క్రీజులోకి రోహిత్ ధనాధన్ బ్యాటింగ్ తో (41) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఇక ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (26) – విరాట్ కోహ్లీ ఉన్నారు. టీమిండియా స్కోర్ 69/1.