TG | ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత

TG | ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత

వజ్రం కన్నా విలువైనది ఆయుధం కన్నా పదునైనది రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

TG | మంచిర్యాల, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత అని మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.బుధవారం పట్టణంలోని హైటెక్ సిటీలో ఉన్న మంచిర్యాల క్లబ్ నందు 52వ డివిజన్ కొరకు ఏర్పాటు చేసిన బూతులో వ్యక్తిగత సహాయకుల ద్వారా వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం అయన మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు సమాజంలో బాధ్యతగా వినియోగించుకొని మంచి పాలకులను ఏర్పాటు చేసుకునేందుకు భవిష్యత్తులో స్థానిక సమస్యలపై కార్పొరేషన్ లో గల వ్యక్తి పరిష్కార మార్గాన్ని చూపే నాయకుని ఎన్నుకోవాలి అన్నారు.వజ్రం కన్నా విలువైనది,ఆయుధం కన్నా పదునైనది భారత రాజ్యాంగం కల్పించిన పవిత్ర మైన ఓటు హక్కు అన్నారు.

Leave a Reply