Mothkur | మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు…

Mothkur | మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు…
- సెల్ఫీ పాయింట్ లో సెల్ఫీలు దిగిన యువతీ, యువకులు
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 8వ వార్డు కు సంబంధించి స్థానిక అంగడి బజార్ లోని మండల ప్రాథమిక పాఠశాలలో 17, 18 వ బూతులకు సంబంధించి మోడల్ పోలింగ్ కేంద్రాన్ని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు .ఈ సందర్భంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడంతో …పోటీపడి యువతీ, యువకులు, అధికారులు, ఓటర్లు, మహిళలు సైతం సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో, తమ స్టేటస్ లో పెట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా… ఈ పోలింగ్ కేంద్రం కాస్త ఓటర్లను పూర్తిస్థాయిలో ఆకర్షించింది. మోత్కూర్ కి చెందిన గౌరు సంతోషి అనే యువతి ఇదే బూతులో తొలిసారిగా ఓటు వేసి …సెల్ఫీ దిగి తనకు చాలా సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
