Fire | పోలీసులపై జగ్గారెడ్డి ఫైర్…

Fire | పోలీసులపై జగ్గారెడ్డి ఫైర్…
Fire | ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః సంగారెడ్డిలో పోలీసులపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. దీంతో సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ శివ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నాడన్నా సమాచారంతో జగ్గారెడ్డి పోలింగ్ బూత్ వద్దకు చెరుకొని పోలీసులపై మండిపడ్డారు. సీఐ శివ కుమార్, హోంగార్డుని వదిలిపేట్టను అని పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం అందుకున్నారు. పోలీసులకు దమ్ముంటే ఇప్పుడు రావాలని సవాల్ విసిరారు. పోలింగ్ ఆపేస్తానంటూ, పోలీసులను తోసుకుంటూ బూత్‌లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు జగ్గారెడ్డి అనుచరులకి తోపులాట జరిగింది.
సీఐ శివకుమార్ ఇక్కడకు రావాలని పోలీసులకు జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికే సీఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు పూర్తిగా సపోర్ట్ చేశాడని సీఐపై మండిపడ్డారు. వార్డులో ఎన్నికలు రద్దు చేయాలంటూ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజేప్పడంతో జగ్గారెడ్డి శాంతించ్చారు.
