Vote | హక్కు వినియోగించుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే…

Vote | తొర్రూరు, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరులోని 16 వార్డులో ఓటు హక్కు కలిగిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ తొర్రూర్ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్ అభ్యర్థికి సానుకూలంగా ఓటింగ్ సర్వే కనిపిస్తుందన్నారు. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలిపించాలని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు 16 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్నారు.
