Dornakal | ఓటు కోసం వృద్ధురాలి పోరాటం..

Dornakal | డోర్నకల్, ఆంధ్రప్రభ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 5, 6 వార్డుల పోలింగ్ కేంద్రంలో వృద్ధురాలికి ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. పోలింగ్ స్టేషన్ గేటు వద్ద వృద్ధులు, వికలాంగుల కోసం అందుబాటులో ఉండాల్సిన వీల్‌చైర్ లేకపోవడంతో ఓ వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో అవస్థలు పడింది. ఆమెను ఓ యువకుడు ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అడ్డుకుని వెంటనే వీల్‌చైర్ తెప్పించారు. అనంతరం వృద్ధురాలిని సురక్షితంగా పోలింగ్ కేంద్రంలోకి పంపించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఆంధ్రప్రభ కెమెరాలో చిత్రీకరించగా, సిబ్బంది అప్రమత్తం కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Leave a Reply