Srisaila Mallanna | దుర్గమ్మ పట్టు వస్త్రాలు..

Srisaila Mallanna | దుర్గమ్మ పట్టు వస్త్రాలు..
Srisaila Mallanna, ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం తరపున శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానానికి పట్టు వస్త్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గాంధీ, ఆలయ కార్యనిర్వాహణాధికారి వీకే సీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి శ్రీశైల దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వైదిక కమిటీకి చెందిన అర్చకుల బృందం వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను శ్రీశైల దేవస్థాన అధికారులకు అందజేశారు.
