Suresh l కాంగ్రెస్ ఓటు వేయండి అభివృద్ధికి అండగా నిలవండి..

Suresh l కాంగ్రెస్ ఓటు వేయండి అభివృద్ధికి అండగా నిలవండి..

1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్టా సురేష్ కుమార్ గుప్తా

Suresh l మక్తల్ ,ఆంధ్రప్రభ; మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి అండగా నిలవాలని మక్తల్ మున్సిపల్ ఒకటవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కట్టా సురేష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన వార్డు ప్రజలకు ఒక లేఖను విడుదల చేశారు .అధికార పార్టీకి మున్సిపాలిటీ పగ్గాలు అప్పగిస్తేనే పట్టణం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీకే అధికారం అప్పగించాలని అప్పుడే కావాల్సినంత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా ఉండటం వల్ల మక్తల్ పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు .ఈ అవకాశానికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు .మక్తల్ పట్టణంలో 16 వార్డుల్లో మంత్రి సహకారంతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. మరింత అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి.

Leave a Reply