అండగా ఉంటా అందుబాటులో ఉంటా

అండగా ఉంటా అందుబాటులో ఉంటా
క్యాతన్ పల్లి,ఫిబ్రవరి 08(ఆంధ్రప్రభ): వార్డు ప్రజలకు నిత్యం అండగా ఉంటూ అందరికి అందుబాటులో ఉంటానని 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ హమించారు.సోమవారం ఎన్నిక ప్రచారంలో భాగంగా వార్డులో విస్తృతంగా ప్రజాదరతో ప్రచారం నిర్వహించారు.అనంతరం
ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే వార్డు అభివృద్ధి సాధ్యమని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళకు పెద్దపీట వేస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు, ఇంటింటికి 200 ఉచిత విద్యుత్ అందిస్తుందని చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.చేయూతనిచ్చిన చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ కోరారు.తనను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటూ వార్డును అభివృద్ధి వైపు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ ఓటర్లను
కోరారు.
