Swarnandhra 2047 | మంత్రుల సమీక్షలో సీఎం చంద్రబాబు

Swarnandhra 2047 | మంత్రుల సమీక్షలో సీఎం చంద్రబాబు

Swarnandhra 2047 | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో భాగంగా పది సూత్రాల అమలు, జీఎస్‌డీపీ వృద్ధిరేటుపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు (Government Schemes) సమాజంలోని అట్టడుగు వర్గాలకు సైతం చేరాలని, పాలనలో పారదర్శకత ఉండాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా పాల్గొని జిల్లాల వారీగా పురోగతిని వివరించారు. పాలనలో అత్యాధునిక సాంకేతికతను జోడించడమే లక్ష్యంగా సీఎం (CM) పలు సూచనలు చేశారు. అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్‌కు శంకుస్థాపన చేశామని, మరో రెండేళ్లలో ఇక్కడి నుంచే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ, డేటా సెంటర్లతో పాలనలో పెనుమార్పులు వస్తాయని పేర్కొన్నారు.

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే దిశగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు (Collector Confrence) పెట్టేవారు కాదు. 3నెలలకోసారి కలెక్టర్ల కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నాం. ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్‌ మంత్రులు పనిచేయాలి. ప్రపంచం గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌ వైపు మళ్లుతోందన్నారు.

CLICK HERE TO READ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

CLICK HERE TO READ MORE

Leave a Reply