11వ వార్డులో దడ పుట్టిస్తున్న అభ్యర్థి భాగ్యవతి మల్లేష్..

11వ వార్డులో దడ పుట్టిస్తున్న అభ్యర్థి భాగ్యవతి మల్లేష్..

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట పురపాలక సంఘ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా తొలిసారి సింహం గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థి భాగ్యవతి మల్లేష్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ దడ పుట్టిస్తున్నారు. వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టణ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఉత్సవాలు, సామాజిక కార్యక్రమాలు, రాజకీయ రంగాల్లో చురుకుగా పాల్గొంటూ యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న భాగ్యవతి మల్లేష్‌కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ఈ వార్డులో ప్రధాన పోటీ భాగ్యవతి మల్లేష్ చుట్టూనే తిరుగుతోందని రాజకీయ విశ్లేషకులు, ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.

తనను కౌన్సిలర్‌గా గెలిపిస్తే.. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసేందుకు అంకితం అవుతానని ప్రచారంలో హామీ ఇస్తున్నారు. పేదల సమస్యలు తెలిసిన వ్యక్తినని, స్వయంగా కష్టపడి ఎదిగిన వ్యక్తినని పేర్కొంటూ, తన సతీమణిని ఒక్కసారి గెలిపిస్తే వార్డు ప్రజల రుణం తీర్చుకుంటానని మల్లేష్ అన్నారు. భాగ్యవతి మల్లేష్ తన భర్తతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ యువకులు, కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి వంటి పథకాల ప్రయోజనాలు అందించే బాధ్యత తీసుకుంటానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

Leave a Reply