Rajashekar l ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి..

Rajashekar l ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి..

ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య

Rajashekar l మక్తల్ , ఆంధ్రప్రభ: మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు నుండి బిజెపి అభ్యర్థిగా ప్రజల మనిషి బి. రాజశేఖర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారని ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య విజ్ఞప్తి చేశారు.ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటో వార్డు పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఔ సందర్భంగా జరిగిన సమావేశంలో కొండయ్య మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న కుటుంబం నుండి వచ్చిన యువ నాయకుడు రాజశేఖర్ రెడ్డి నీ ఆదరించాలని కోరారు. బాయికాటి కుటుంబం ప్రజాసేవకే అంకితమైన విషయం మీ అందరికీ తెలుసు అన్నారు .నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే యువ నాయకుడు రాజశేఖర్ రెడ్డి అందరితో కలిసి మెలిసి ఉంటారని అందరికీ ఆప్తుడిగా కొనసాగుతారని గుర్తు చేశారు .మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ మాయ మాటలు విని మోసపోవద్దని కోరారు.

Leave a Reply