3 వ వార్డు బీజేపీ అభ్యర్థి శాంతిరెడ్డి ప్రచారం

3 వ వార్డు బీజేపీ అభ్యర్థి శాంతిరెడ్డి ప్రచారం

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డు లో బిజెపి అభ్యర్థి చిలుగురి శాంతి రెడ్డి ఆదివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తనని గెలిపించవలసిందిగా కోరారు. ద్వారకా నగర్, బృందావన్ కాలనీ, సుభాష్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారం జరగగా నాయకులు అయిలి సందీప్ గౌడ్, కటకం రాజు, మండల పార్టీ అధ్యక్షులు పూజారి కుమారస్వామి, బైరి మహేందర్ గౌడ్, చిలుగురి అలివేలు, కళ్లెం రాజు గౌడ్, పంపరి లక్ష్మీనారాయణ, కటకం వెంకటేష్, అమర్నాథ్, సంపత్ పాల్గొన్నారు.

Leave a Reply