AP CM | ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో…

AP CM | ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో…
AP CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఏర్పాటు కానున్న ‘క్వాంటమ్ వ్యాలీ’ భవనానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్రసింగ్ శంకుస్థాపన చేశారు. క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు.
ఇందుకోసం ప్రభుత్వం 50ఎకరాలను కేటాయించింది. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో ఇక్కడ పరిశోధనలు సాగనున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని, మంత్రులు లోకేశ్, నారాయణ, దుర్గేశ్ పాల్గొన్నారు.
