మద్దతు కోరుతూ ఎన్నికల మేనిఫెస్టో వివరాలు

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీలోని ముగ్ధంపురం గ్రామంలో 11వ, 12వ వార్డు ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చీకటి స్వరూప ఓదయ్య గౌడ్ (చీకటి ఓదెలు), ఇస్లావత్ రమ గోపి ప్రజాసేవ యాత్రను వేగవంతం చేస్తున్నారు. గ్రామపంచాయతీ మున్సిపాలిటీలో విలీనమైన సందర్భంగా ఈ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన ఈ అభ్యర్థుల మేనిఫెస్టోలో తాగునీరు, రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ఆలయాలు తదితర సౌకర్యాలపై 19 పూర్తి హామీలు ఇచ్చారు.

చీకటి ఓదెలు.. 35 ఏళ్ల ప్రజాసేవా యోగ్యత
గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణగల కార్యకర్తగా పనిచేసిన చీకటి స్వరూప ఓదయ్య గౌడ్ (చీకటి ఓదెలు), గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. పదవులు లేకపోయినా గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండి..
- నల్లాల బావి నుండి మంచినీటి ట్యాంకు వరకు డ్యామేజ్ అయిన పైప్‌లైన్ దెబ్బతిన్నప్పుడు దొంతి మాధవరెడ్డి. సహకారాలతో పునర్నిర్మించారు.
- ఎంపీ నిధులతో వాటర్ ప్లాంట్ షెడ్, ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
- స్కూలు ఆవరణలో పిల్లలకు భవనం, అంగన్వాడీల పూర్తి నిర్మాణం, తండాలో అంగన్వాడీ భవనం కట్టించారు.
- స్వంత ఖర్చుతో బతుకమ్మ తల్లి విగ్రహం, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో బీరన్న గుడి నిర్మాణం.
- ముగ్ధంపురం తండా దుర్గామాత గుడికి విగ్రహం ఇప్పించారు.
- ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు తదితర పథకాలు ప్రజలకు అందించారు.
గత సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఉనిక కోసం ఓడిపోయినా, ఎంపిటిసిగా గెలిచి, ఆర్థిక నష్టాలు ఎదుర్కొని, తన కూతురి పెళ్లి వాయిదా వేసుకుని ప్రజాసేవ కొనసాగించారు. ఇప్పుడు 11వ వార్డు కౌన్సిలర్‌గా పోటీపడుతున్నారు.
19 హామీల మేనిఫెస్టో.. గ్రామ అభివృద్ధి పనులు
అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ సహకారంతో ఈ హామీలన్నీ నెరవేర్చకపోతే తదుపరి ఎన్నికల్లో ఓటు అడగని స్పష్టం చేస్తూ చీకటి ఓదెలు ప్రజలకు మేనిఫెస్టో వివరించారు:
- డాక్రా గ్రూపు మహిళలకు వివో భవనం (స్థలం లేకపోతే పంచాయతీ భవనంపై).
- బతుకమ్మ స్థలానికి సీసీ రోడ్డు, గద్దెలు.
- కొత్త వాటర్ ప్లాంట్ షెడ్, ప్లాంట్, కమిటీతో నిరంతర మంచినీటి సరఫరా.
- యూత్ క్లబ్ భవనం.
- మిషన్ భగీరథ కొరతలకు నల్లాల బావి పునరుద్ధరణ, మోటారు ఏర్పాటు.
- స్మశాన వాటికల పూర్తి నిర్మాణం, సోలార్ లైట్లు, నీటి సౌకర్యాలు, సీసీ రోడ్డు.
- రోడ్డు వెడల్పు పనుల్లో నాణ్యత పరిశీలన.
- రోడ్డు వెడల్పులో ఇళ్లు, కరెంటు స్తంభాల సమస్యల పరిష్కారం.
- కొత్త పైప్‌లైన్, చివరి ఇంటి వరకు నీటి సరఫరా.
- కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, నాణ్యత విద్యుత్ సరఫరా.
- నెక్కొండ రోడ్డు నుండి కొత్తపల్లి మీదుగా రాజపల్లెకు సీసీ రోడ్డు.
- ఎస్సీ కాలనీలో అంబేద్కర్ భవనం.
- కురుమ సంఘానికి కమ్యూనిటీ భవనం, బీరన్న గుడికి కాంపౌండ్ వాల్.
- ముదిరాజులకు కమ్యూనిటీ హాల్, మైసమ్మ గుడి పూర్తి నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ.
- గౌడ కులస్తులకు కళ్లు అమ్మకాల షెడ్, కాటమయ్య గుడి నిర్మాణం.
- యాదవులకు కమ్యూనిటీ భవనం.
- రజకులకు మడేలయ్య గుడి.
- తండా దుర్గామాత గుడికి కాంపౌండ్ వాల్.
- అంతర్గత కాలువలు, సీసీ రోడ్లు; పథకాలు అందరికీ పార్టీలకు అతీతంగా.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఈ పనులు చేపట్టుతానని హామీ.
పార్టీలకు అతీతంగా ఓటు.. గెలుపు కోరిక
“గ్రామ ప్రజలందరూ ఆలోచించి, 11వ వార్డు చీకటి స్వరూప ఓదయ్య గౌడ్‌ను, 12వ వార్డు ఇస్లావత్ రమ గోపిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ ఇద్దరి అభ్యర్థుల గెలుపు గ్రామ భవిష్యత్తును మార్చుతుందని ప్రజలు భావిస్తున్నారు.
