Chandrababu| బ్రహ్మోత్సవాలకు రండి..

Chandrababu| బ్రహ్మోత్సవాలకు రండి..
సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
Chandrababu| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాయుడుకు ఆహ్వానం అందింది. ఈనెల 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు ఆహ్వానించారు.
ఈసందర్భంగా వేద పండితులు సీఎంకు స్వామివారి ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనం ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహానంది బ్రహ్మోత్సవాలకు కూడా సీఎంను ఆహ్వానించారు.

