ఇంటింటి ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి కోసం 7వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సి.నవీద్ పాషాను ఆదరించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులు చిట్యాల జుబేర్ పాషా విజ్ఞప్తి చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీరామ్ నగర్ కాలనీ,రహమానియా కాలనీలో విస్త్రుతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో పూర్తిగా వెనకబడ్డ 7వ వార్డు ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని అన్నారు. శ్రీరామ్నగర్ కాలనీలో ఇప్పటికీ సరైన రోడ్లు మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు గత పాలకుల నిర్లక్ష్యం కారణమన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా కూడా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు .ఇకముందు కూడా జరిగే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ఆయన వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడ పనులు జరగడం లేదన్నది వాస్తవం అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒకసారి శ్రీరామ్ నగర్ కాలనీ ,అయ్యప్ప కాలనీ, రెహమానియా కాలనీలోకి వస్తే అభివృద్ధి అంటే ఏమిటో వారికి తెలియ వస్తుంది అన్నారు .అందుకనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మి మోసపోకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన 7వ వార్డు అభ్యర్థి చిట్యాల నవీద్ పాషాను భారీ మెజార్టీతో గెలిపించాలని జుబేర్ పాష విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply