ఆలేరులో ప్రచారం జరిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆలేరులో ప్రచారం జరిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి ఆలేరు మున్సిపల్ కేంద్రంలో వివిధ వార్డుల్లో శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఓటర్లను కలుసుకొని ప్రజా ప్రభుత్వ పాలనకు మద్దతుగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 1,6,7 వార్డుల కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు చింతకింది మురళి, అంగడి అంజనేయులు, బీజని బాలమణి భాస్కర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎం ఏ ఎజాస్, కొండ్రాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీటీసీ ఆరే ప్రశాంత్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ ఎగ్గిడి యాదగిరి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెస్ విజయ్ కుమార్,నాయకులు కే సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, వల్లెపు ఉప్పలయ్య, మంద లక్ష్మి, కందగట్ల నిర్మలా నరేందర్, ముదిగొండ శ్రీకాంత్, పోరళ్ల సతీష్, రచ్చ హనుమంతు, గాదె సోమిరెడ్డి, దూడల రమేష్, బీజని భాస్కర్, దూడల రాజశేఖర్ గౌడ్, మెరుగు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply