ఆడబిడ్డని ఆదరించండి.. వార్డును అభివృద్ధి చేస్తా …

ఆడబిడ్డని ఆదరించండి.. వార్డును అభివృద్ధి చేస్తా …
- 16 వ వార్డు లో జోరుగా ఎక్కల దేవి ఆకాంక్ష ప్రచారం …
జనగామ, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ) : జనగామ మున్సిపాలిటీ 16 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎక్కల దేవి ఆకాంక్ష డోర్ టు డోర్ జోరుగా ఇంటింటా ప్రచారం కొనసాగిస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే పుల్లా రాజేశ్వర్ రెడ్డి ఆశీస్సులతో మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయుటకు ఏకమవుతూ ఇంటింటా ప్రచారంలో నూతన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు.
ప్రతి ఇంటా వెళ్లి ప్రజల సమస్యలు వింటూ గెలిపిస్తే 16 వ వార్డును మరింత అభివృద్ధి దిశగా పనులు చేపడతామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే పల్లా సహాయ సహకారంతో సొంతింటికలను, తాగునీటి సమస్యను, వార్డు అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తానన్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఎక్కల దేవి ఆకాంక్ష గెలుపే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమం లో గులాబీ శ్రేణులు, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు…
