Sport | విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి…

Sport | విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి…
- చిట్యాలలో నియోజకవర్గ సీఎం కప్ క్రీడల ప్రారంభంలో ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
Sport | చిట్యాల, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువుతోపాటు, క్రీడల్లో రాణించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కోరారు . భూపాలపల్లి నియోజకవర్గం 8 మండలాల విద్యార్థులతో సీఎం కప్ క్రీడలు ఈ రోజు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎమ్మెల్యే జిఎస్సార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేకు క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే కబడ్డీ క్రీడలు ప్రారంభించి విద్యార్థులతో ఆడారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను క్రీడల్లో ఉన్నత స్థాయికి రాణించేందుకు కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీవో హరికృష్ణ, భూపాలపల్లి సీఎం కప్ క్రీడల నియోజకవర్గ కన్వీనర్ కోడెపాక రఘుపతి. తాసిల్దార్ ఇమామ్ బాబా, ఎంపీడీవో జయశ్రీ, చిట్యాల సర్పంచ్ తవటం లక్ష్మి, చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవితో పాటు పలు గ్రామాల సర్పంచులు, అధికారులు, నాయకులు, ఫిజికల్ డైరెక్టర్లు విద్యార్థులు పాల్గొన్నారు.



