
అధికార కాంగ్రెస్ వల్లే అభివృద్ధి సాధ్యం …
జనగామ, ఆంధ్రప్రభ : అధికార కాంగ్రెస్ పార్టీ వాల్లనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని 13 వార్డు అభ్యర్థి మేడ శ్రీనివాస్ అన్నారు.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 13 వార్డు లో జోరుగా ఇంట్టింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మేడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధి కోసం పని చేసే వాళ్లకే పట్టం కట్టాలని అన్నారు. 13 వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని వార్డులో ఇంటింటికి తిరిగి సమస్యలను గుర్తించి పనిచేస్థానని కాంగ్రెస్ అభ్యర్థి గా హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. బీఆర్ఎస్- బిజెపి మాటలు నమ్ము మోసపోవద్దు వెల్లడించారు. వీరి వెంట నాయకులు మహిళలు పలువురు పాల్గొన్నారు…
