Gold rates | ఆగిన ప‌సిడి ప‌రుగు

Gold rates | ఆగిన ప‌సిడి ప‌రుగు

  • స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు
  • 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,000
  • 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,650
  • కేజీ వెండి ధర రూ.9వేలు దిగొచ్చి రూ.2,60,000

Gold rates | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : భార‌త్‌లో గోల్డ్‌కు ఎక్క‌డ లేని క్రేజ్ ఉంటుంది. బంగారం కొనేవారు ఎక్కువ‌గా మ‌న దేశంలోనే ఉంటారు. ముఖ్యంగా బంగార‌మంటే మ‌హిళ‌లు ప‌డిచ‌చ్చిపోతారు. వివిధ ఆభ‌ర‌ణాలు చేయించుకొని అలంక‌రించుకోవాల‌ని ఆశ‌ప‌డుతుంటారు. ఆభ‌ర‌ణాలుంటే ఒక స్టేట‌స్‌గా కూడా ఫీల్ అవుతారు. బంగారం కొన‌కుండా వివాహాది శుభ‌కార్యాల‌యాలు జ‌ర‌గ‌వంటే దీని ప్రాముఖ్య‌త ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు. అలాంటి బంగారం ధ‌ర‌లు రోజుకో తీరుగా మారుతున్నాయి. కొన్ని రోజులుగా బంగారం ధ‌ర రికార్డు స్థాయిలో పెరిగింది. ఇటీవ‌ల కొంచెం హెచ్చు త‌గ్గుద‌లుగా ధ‌ర‌లు ఉంటున్నాయి. అస‌లే పెళ్లిళ్ల సీజ‌న్ రాబోతోంది. బంగారం త‌ప్ప‌క కొనాల్సిన ప‌రిస్థితి ఈ స‌మ‌యంలో ప్ర‌తీ ఒక్క‌రూ బంగారం ధ‌ర త‌గ్గితే బాగుండు అని కోరుకుంటున్నారు. అయితే ఈ రోజు (శుక్ర‌వారం) బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం..

క్రితం రోజుతో పోలిస్తే బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,000 పలికింది. గురువారంతో పోలిస్తే దాదాపు రూ.1600 తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,39,650గా ఉంది. మరోవైపు, కేజీ వెండి ధర రూ.9వేలు దిగొచ్చి రూ.2,60,000 పలికింది.

Leave a Reply