delhi l ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

delhi l ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

కరీమాబాద్, ఆంధ్రప్రభ; ఆల్ ఇండియా జాక్టో ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న మహా ధర్నాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పిఆర్ టి యుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిసుంకరి బిక్షం గౌడ్ పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉపాధ్యాయ సమస్యలతో పాటు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందించేందుకు జాతీయ ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపుమేరకు ప్రభుత్వఉపాధ్యాయులు ఢిల్లీకి చేరుకున్నారు.

సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి తప్పకుండా మినాయింపు ఇవ్వాలని శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతోపాటు సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్టు తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ జిల్లాల నుండి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఈ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిమహేందర్, హనుమకొండ అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి, పి ఆర్ టి యు టి ఎస్ కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply