మీ బిడ్డగా ఆదరించండి వార్డు అభివృద్ధి నా బాధ్యత

1వ వార్డు బిజెపి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి
మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ)మీ బిడ్డగా మీ ముందుకు వచ్చా ఆదరించండి ఆశీర్వదించండి కౌన్సిలర్ గా గెలిపించండి ఈ ప్రాంత అభివృద్ధి తన అభిభతంగా పనిచేస్తానని 1వ వార్డు బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాయికాటి రాజశేఖర్ రెడ్డి అన్నారు .గురువారం తన మద్దతు దారులతో కలిసి ఆయన వార్డు పరిధిలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మీ బిడ్డను మీ ఇంటి పక్కనే ఉంటా ఏ వేళలో ఏ సమస్య వచ్చినా మీ ముందుకు వస్తా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మునిసిపాలిటీల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సాధ్యమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎలాంటి నిధులు ఇవ్వదన్నారు .మున్సిపల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంపీ డీకే. అరుణమ్మ సహకారంతో 1వ వార్డులో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి మక్తల్ లోనే ఆదర్శ వార్డుగా 1వ వార్డును తీర్చిదిద్దుతానని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో వెనుకబడ్డ 1వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మీ అందరి సహకారంతో వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని 11న జరగనున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి 1వ వార్డు కౌన్సిలర్ గా తనను గెలిపించాలని రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పసుల గోపిరెడ్డి, మిఠాయి సురేష్ ,బాల్ రెడ్డి,విద్యాసాగర్, దేవిదాస్ పెద్ద సంఖ్యలో మద్దతు దారులు పాల్గొన్నారు.
