ఆదరించండి అభివృద్ధి చేస్తా- తీగల రమేష్

ఆదరించండి అభివృద్ధి చేస్తా- తీగల రమేష్
రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 05(ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజాప్రతినిధిగా కాకుండా ప్రజాసేవకులుగా మీ అందరి ఇంటి మనిషిగా వార్డు అభివృద్ధి కోసమే పని చేస్తానని 1వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి తీగల రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 1వ వార్డు పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్,తారక రామ కాలనీలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న పార్టీ నాయకుల,కార్యకర్తల నినాదాలతో ప్రచారం హోరెత్తింది.ఈ సందర్భంగా తీగల రమేష్ మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో వార్డును అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.ఓటర్లను కలుసుకొని మద్దతు కోరుతూ ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని మాటిచ్చారు.
అధికార పార్టీతో మాత్రమే వార్డు అభివృద్ధి సాధ్యమని ఆయన గుర్తు చేశారు.చేతి గుర్తు కు ఓటేసి అధిక మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు.
