బీఆర్‌ఎస్‌కు వెల్లువెత్తుతున్న మద్దతు

బీఆర్‌ఎస్‌కు వెల్లువెత్తుతున్న మద్దతు

  • అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి విస్తృత ప్రచారం

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో బీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. గురువారం రోజు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు అభ్యర్థి వేణుగోపాల మూర్తిని ఆప్యాయంగా స్వాగతిస్తూ తమ ఓటు బీఆర్‌ఎస్‌కే అని హామీ ఇచ్చినట్లు తెలిపారు.బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కందుకూరి వేణుగోపాల మూర్తి భారీ మెజారిటీతో గెలిపిస్తామని స్థానికులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం నాయకులు శంకరాచారి, గుగ్గిళ్ళ రాజు, కోటేశ్వర్, శివారపు రాజు, మహ్మద్ ఆజ్మీయ, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply