Cake | ప్రజల మధ్య జన్మదిన వేడుకలు

Cake | ప్రజల మధ్య జన్మదిన వేడుకలు
- ఐదవ వార్డు కార్నర్ మీటింగ్లో కేక్ కటింగ్
- శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ప్రజలు
Cake | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ జన్మదిన వేడుకలు ప్రజల మధ్యలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు పరకాల మున్సిపల్ ఎన్నికల కార్నర్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథం సమక్షంలో, పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దొమ్మటి సాంబయ్య ల మధ్య పట్టణంలో ఐదవ వార్డులో ఎన్నికల కార్నర్ ప్రచారంలో పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ జన్మదినం పురస్కరించుకొని ప్రజల మధ్య కేక్ కట్ చేసి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ వేడుకల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రామకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
