ఓటు వేసి గెలిపించండి అభివృద్ధి చేస్తాను

ఒకటో వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థి కర్నె లక్మీ నర్సయ్య

భీమ్‌గల్‌ టౌన్, ఫిబ్రవరి4 (ఆంధ్రప్రభ): పువ్వు గుర్తుకు ఓటు వేసి విజయం అందించాలని ఒకటో వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థి కర్నె లక్మీ నర్సయ్య కోరారు. బుధవారం ఒకటో వార్డు లో ఆయన అనుచరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతి లేని పాలన కొరకు బీజేపీ నుండి కౌన్సిలర్ గా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకటో వార్డు వ్యక్తిగా కాలనీ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా సమస్యలు పరిష్కారం చేస్తానని అన్నారు. ఒకటో వార్డు లో ఉండే తన కొరకు ప్రజల ఎప్పుడైనా తన ఇంటికి రావొచ్చని అన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే తనను ఆదరించాలని కోరారు. కేంద్రం లో ఉన్న మోడీ పాలన, కేంద్ర పథకాలు, దేశం అభివృద్ధి చెందుతున్న తీరు, ప్రపంచ దేశాల గుర్తింపు తదితర అంశాల గురించి వివరించారు. అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవడం ద్వార సమస్యలు పరిష్కారం అవుతాయని, మీ లో ఒకడిగా గుర్తించి కమలం ( పువ్వు ) గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆయన వెంట బీజేపీ శ్రేణులు ఉన్నారు.