AP | ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట

AP | ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట

  • ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

AP | పామర్రు – ఆంధ్రప్రభ : ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. బుధవారం పామర్రు మండలం యలకుర్రు గ్రామంలో 36 లక్షల వ్యయంతో విలేజ్ హెల్త్ క్లినిక్(ఆరోగ్య కేంద్రం) శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయమేమి ద్వారా నియోజకవర్గంలో రెండు కోట్లకు పైగా ప్రజలకు చెక్కులను వచ్చినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, పామర్రు ఏఎంసి చైర్మన్ జన్ను శోభన్ బాబు వారితోపాటు అధికారులు, మండల అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కూటమి నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.