సీఐగా సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరణ
సీఐగా సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరణ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా ఎ.సుబ్రహ్మణ్యం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సిటీ టాస్క్ ఫోర్స్ సీఐగా పనిచేస్తూ బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ ఎ.చంద్రశేఖర్ స్పెషల్ బ్రాంచి సీఐగా బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా నూతన సీఐ సుబ్రహ్మణ్యంకు బదిలీపై వెళుతున్న సీఐ చంద్రశేఖర్ బాధ్యతలు అప్పగించారు. నూతన సీఐని ఎస్సైలు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
