ఎండపల్లిలో గ్రామాభివృద్ధిపై గ్రామ సభ…

ఎండపల్లిలో గ్రామాభివృద్ధిపై గ్రామ సభ…
- అంబేద్కర్ విగ్రహం, పీహెచ్‌సీ స్థలం కోసం పరిశీలన
ఎండపల్లి, ఆంధ్ర ప్రభ : ఎండపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు సమస్యల పరిష్కారంపై గ్రామ ప్రజలతో విస్తృతంగా చర్చించారు. మండల కేంద్రాన్ని మరింత మెరుగుపరిచేలా నూతనంగా ఏర్పాటు చేయనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి గ్రామ పంచాయతీ సభ్యులు స్థలాన్ని పరిశీలించారు.
విగ్రహ ఏర్పాటు కోసం గ్రామ సభలో వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా పలు ప్రభుత్వ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఏర్పాటుకు అవసరమైన స్థలాలపై కూడా పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని సభలో నిర్ణయించారు. ఈ కార్యాక్రమంలో సర్పంచ్ మారం సునీత రెడ్డి, గ్రామ కార్యదర్శి ప్రభాకర్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, గ్రామస్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

