16వ వార్డు అభ్యర్థిగా గెలిపించాలి

16వ వార్డు అభ్యర్థిగా గెలిపించాలి
- వార్డు అభివృద్ధికి కృషి చేస్తా.. రెండుసార్లు కౌన్సిలర్గా సేవలందించాను
- నాకు ఓటేసి గెలిపించాలి
- టిఆర్ఎస్ అభ్యర్థి ఆలూరి విజయమ్మ
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ లో ఉన్న 16వ వారు వార్డు అభ్యర్థిగా టిఆర్ఎస్ నుండి గెలిపించాలని అభ్యర్థి ఆలూరు విజయమ్మ ఓటర్లను కోరారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 16వ వార్డులో సంజయ్ నగర్ కాలనీ మహబూబ్ దర్గా ప్రాంతంలో ఆలూరు విజయమ్మ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు తన భర్త ఆలూరి నరేందర్ నేను ఆలూరు విజయమ్మ ఈ వార్డు నుండి రెండుసార్లు గెలుపొంది ఈ ప్రాంత వార్డు ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సేవలు అందించామని ఆమె ఓటర్లకు వివరించారు. టిఆర్ఎస్ హయాంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. మూడున్నర కోట్లతో సిసి రోడ్లు డ్రైనేజీ వాటర్ పైప్ లైన్ ఎల్ఈడి లైట్లు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించి మౌలిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని విజయమ్మ ఓటర్లకు తెలిపింది. టిఆర్ఎస్ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్మశాన వాటిక రవీంద్ర టాకీస్ నుండి నాగనూరు వరకు సిసి రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ వార్డును అభివృద్ధి చేశామని ఆమె ఓటర్లకు తెలుపుతూ ప్రచారాన్ని మహిళలతో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మద్దతుతో టిఆర్ఎస్ పక్షాన పోటీ చేస్తున్నానని వారి సహకారంతో ఏ సమస్య వచ్చినా ఓటర్లకు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.
