AP | డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు..

AP | డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు..
AP |మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని డంపింగ్ యార్డులో మంగళవారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాలు పొగమంచుతో నిండిపోయాయి. ఘటన పై స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు మచిలీపట్నం, పెడన పరిసర ప్రాంతాల్లోని విద్యుత్ లైన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. మంటలు కారణంగా విద్యుత్ లైన్లకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
