రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి పరామర్శ

ఘంటసాల, ఆంధ్రప్రభ ; ఘంటసాల మండలం జీలగలగండి గ్రామానికి చెందిన కొప్పుల అరవింద్, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్చూరి దుర్గాప్రసాద్, తెలుగుయువత నాయకులు మేడికొండ విజయ్ మరియు ఘంటసాల క్లస్టర్ ఇంచార్జి పాటిబండ్ల నరేష్ మరియు అవనిగడ్డ ఏపిపి కర్రా సుధాకర్ లు బాధితుని కుటుంబాన్ని పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తూమాటి ప్రసాద్, చిన్ను, నాగరాజు, మేడికొండ రవి, కంచర్ల జార్జ్ తదితరులు పాల్గొని, బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
