parakala | మొక్కలు నాటిన ప్రిన్సిపల్, అధ్యాపకులు

parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్, అధ్యాపకులు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం రోజు పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బేతి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కళాశాలలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి విద్యార్థి మరియు ప్రతి వ్యక్తిపై ఉందని ప్రతి ఒక్కరు మొక్కలను విరివిగా నాటాలని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అన్నం శ్రీనివాసరెడ్డి, కళాశాల స్టాప్ సెక్రటరీ డాక్టర్ అలిశాల అశోక్, డాక్టర్ మల్లయ్య, డాక్టర్ జి పావని, బి మహేంద్రరావు, ఏం సమ్మయ్య, డాక్టర్ టి కల్పన డాక్టర్ ఏ రమేష్, డాక్టర్ జి రామకృష్ణ, ఆర్ ఈశ్వరయ్య, ఎస్ రాజశ్రీ, డాక్టర్ జి రాజేష్ కుమార్, డాక్టర్ జి స్వప్న, డాక్టర్ డి సంజయ్ కుమార్, సంధ్య, అలేఖ్య, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply