protest | వరంగల్‌లో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

protest | కరీమాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ వరంగల్ నగరంలో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం వరంగల్ చౌరస్తాలో సిట్ నోటీసులు నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమంలో నగరంలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు కార్యకర్తలు ప్లే కార్డ్స్ చేబుని నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
