Dharna | సిట్ విచారణకు వ్యతిరేకంగా ర్యాలీ

Dharna | సిట్ విచారణకు వ్యతిరేకంగా ర్యాలీ

  • కేసీఆర్‌పై కక్ష రాజకీయాలు మానుకోవాలి
  • ​భీమ్‌గల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ
  • ​పాలన వదిలి వేధింపులే లక్ష్యంగా కాంగ్రెస్‌ సర్కార్‌ తీరు

Dharna | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్‌ విచారణ పేరుతో వేధించడం మానుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం భీమ్‌గల్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.​ తెలంగాణను ప్రగతి పథంలో నడిపించిన నేతపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ తరహా విచారణలకు తెరలేపారని విమర్శించారు.

సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన పాలకులు.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ అరెస్టులు, వేధింపులకు దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై జరుగుతున్న కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మాజీ జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, సొసైటీ చైర్మన్ శివసారీ నర్సయ్య, నాయకులు శర్మ నాయక్, తుక్కాజి నాయక్, పతాని లింబాద్రి, శెవ్వ అశోక్, పర్స నవీన్, సుంకరి గాంధీ, రాము, దీక్షిత్, శీను, కృష్ణ, అవేస్, అబ్దుల్లా, మాజీ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply