Station Ghanpur | సేవ చేసేందుకే…నేను పోటీ చేస్తున్నా..

Station Ghanpur | సేవ చేసేందుకే…నేను పోటీ చేస్తున్నా..
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఆశీస్సులతో..
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో సౌదరపల్లి సంపత్ రాజు
Station Ghanpur | స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ పట్టణంలోని 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సౌదరపల్లి సంపత్ రాజు ఎన్నికల బరిలో నిలిచారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఆశీస్సులతో ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఈ సందర్భంగా సంపత్ రాజు మాట్లాడుతూ. నేను సేవ చేసేందుకే 9వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి..మీ వెన్నంటే ఉంటాను. నన్ను గెలిపించే బాధ్యత మీది..అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ప్రజలను కోరారు.
వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్, రోడ్లు, పరిశుభ్రతతో పాటు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే కౌన్సిలర్‌గా పనిచేస్తానన్నారు. సంపాదన కోసం కాకుండా వార్డు అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయాలకు తావులేకుండా నిరంతరం పారదర్శక పాలన అందిస్తానని స్పష్టం చేశారు. తనను ఆశీర్వదించి కౌన్సిలర్‌గా గెలిపిస్తే సేవ చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని సంపత్ రాజు అన్నారు.
