Temple | ప్రారంభమైన గజ్జెలమ్మ ఆలయ వార్షికోత్సవం..

Temple | ప్రారంభమైన గజ్జెలమ్మ ఆలయ వార్షికోత్సవం..
Temple | కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాల ఇలవేల్పు గజ్జెలమ్మ ఆరవ వార్షికోత్సవం ఉత్సాహాలు అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా స్థానిక పండితులచే పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ పాండే రామానుజ దాస్, శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. భగవతి ప్రార్ధన, విశేష సంకల్పం, మహాగణపతి పూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, స్థాపితదేవత హోమం, కుంకుమార్చన కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం నుండే ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అంగరంగ వైభవంగా ఆరవ వార్షికోత్సవం చేపడుతున్నారు. దీంతో సాయంత్రం వేళలో అధిక సంఖ్యలో మహిళలు కుంకుమార్చన కార్యక్రమానికి హాజరయ్యారు. గజ్జెలమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర ప్రాంతాల నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు గజ్జెలమ్మ దేవి ఆలయానికి చేరుకున్నారు.

దీంతో ఆలయం భక్తులతో జనసంద్రమైంది. ప్రత్యేక పూజ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహించారు. అంతేకాకుండా గజ్జెలమ్మ ఆలయానికి భక్తులు సైతం విరాళాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
