Sangareddy | సమన్వయకర్తగా పట్లోళ్ల శశిధర్ రెడ్డి

Sangareddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు ఎన్నికల సమన్వయకర్తగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి గారిని నియమించినట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్, కోహిర్, సదాశివపేట, సంగారెడ్డి, ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, జిన్నారం, అందోల్–జోగిపేట్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలకు ఎన్నికల సమన్వయకర్తగా పట్లోళ్ల శశిధర్ రెడ్డిని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు నియమించినట్లు ఆయన వెల్లడించారు.

రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో సమన్వయం మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు చింత ప్రభాకర్ వివరించారు. పట్లోళ్ల శశిధర్ రెడ్డికి ఉన్న విశాల రాజకీయ అనుభవం పార్టీకి ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నియామకంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యకలాపాలు మరింత వేగవంతమవుతాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ఈ సమన్వయం దోహదపడుతుందని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply