Students | మంచితనానికి మారుపేరు…

Students | మంచితనానికి మారుపేరు…
- ప్రభుత్వ విద్యార్థులకు ప్రతి సంవత్సరం పారితోషికం…
Students | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మంచితనానికి మారుపేరుగా మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన కైపు రామచంద్రారెడ్డి నిలుస్తున్నాడు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మండల పరిధిలోని మొరంపల్లి బంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణతపొందిన టాప్ మార్కులు పొందినటువంటి విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నత చదువులు చదువుకోవటానికి ప్రోత్సహిస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రతి సంవత్సరం పారితోషికానికి విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందిస్తున్నారు. చనిపోయిన తన తండ్రి పిచ్చిరెడ్డి, అకాల మరణం పొందిన తన కూతురు జ్ఞాపకార్ధంగా పేదరిక విద్యార్థుల కు అండగా నిలబడుతూ ఆర్థిక సాయం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన అడుగుజాడల్లో మరికొందరు బంజరు గ్రామానికి చెందినవారు విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. మంచితనానికి కైపు రామచంద్రారెడ్డి చేసినటువంటి సేవలు అమోఘమని పలువురు అభినందిస్తున్నారు.
