Republic | పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

Republic | పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు
Republic | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వివిధ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉత్తమ ఉద్యోగుల ప్రశంస పత్రాలు ఈ రోజు అందజేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో ఉద్యోగుల సేవలను గుర్తించి ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రశంస పత్రాలు అందించారు.
వీరిలో లక్షేట్టిపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ మూర్తి, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఐకేపీ సూరమళ్ళ భూమక్క,ఎపిఓ వేణుగోపాల్ తదితరులున్నారు. ప్రశంసా పత్రాలు పొందిన ఉద్యోగులకు ఆయా శాఖల సిబ్బంది అభినందనలు తెలిపారు.
