CM | సహాయ నిధి చెక్కు పంపిణీ

CM | ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్న పేదవాడికి అండగా సీఎం సహాయనిధి పనిచేస్తుందని రాచలపల్లి సర్పంచ్ మహేష్ అన్నారు. మండల పరిధిలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన కల్లు బచ్చిరెడ్డికి రూ. 60 వేలు, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సహకారంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామ సర్పంచ్ మాడుగుల మహేష్ ఆధ్వర్యంలో లబ్ధిదారునికి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఆపదలో సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
