Committee | శ్రీ మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు …

Committee | శ్రీ మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు …

Committee | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : బచ్చన్నపేట మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఈ రోజు అత్యంత వైభవంగా జరిగాయి. మాఘమాస శుద్ధ తదియను పురస్కరించుకొని తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి పోటెత్తారు. వైభవంగా పూజా కార్యక్రమాలు, ఉత్సవాల్లో భాగంగా ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ మార్కండేయ స్వామి వారికి, పంచముఖ ఆంజనేయ స్వామికి, నాగదేవతకు భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ అర్వపల్లి శ్రీకృష్ణ శర్మ పర్యవేక్షణలో శ్రీ శివ స్వామికి రుద్ర అభిషేకం, లోక కళ్యాణార్థం మృత్యుంజయ ఈ యజ్ఞ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ హోమంలో పెద్ద సంఖ్యలో భక్తులు దంపతుల సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మార్కండేయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గణపురం ఆనంద్ , స్వామి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

Leave a Reply